Vatti Vasanth Kumar Passes Away: మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ కుమార్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మూడేళ్ల క్రితమే వసంత్ కుమార్ భార్య చనిపోయింది. వారికి పిల్లలు లేకపోవడంతో బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్నారు. వట్టి వసంత్‌కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల గ్రామం. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడిగా వట్టి వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
Nara Chandrababu: తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కొంతకాలంగా వసంత్ కుమార్ విశాఖలో నివసిస్తున్నారు. రాష్ట్రవిభజన అనంతరం ఆయన వైజాగ్‌లో స్థిరపడ్డారు. 2009లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. రోశయ్య క్యాబినెట్‌లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2018లో టీడీపీ- కాంగ్రెస్ కలయిక తర్వాత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. 2014 నుంచి కాంగ్రెస్‌కు, రాజకీయాలకు దూరంగా విశాఖలో నివాసం ఉంటున్నారు. వసంత్ భౌతికకాయాన్ని సొంత గ్రామం పూండ్లకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.