Site icon NTV Telugu

Perni Nani: ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Perninanai

Perninanai

ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ఎమెల్యే కొలికపూడి ఎవరో టీవీలో చూడటం తప్ప నాకు పరిచయం లేదన్నారు. ఎంపీ చిన్ని చెప్పినట్లుగా కొలికపూడి నాతో మాట్లాడితే నేను ధైర్యంగా మాట్లాడాడు అని చెబుతానని అన్నారు. కొలికపూడి, ఎంపీ చిన్ని బతుకు బస్టాండ్ చేసి బట్టలూడతీశాడన్నారు. హైదరాబాద్ లో చేసిన పాపాలు అన్నీ బయటపడ్డాయి. పేకాట తప్ప ఏ ఆట రాని వ్యక్తి కేశినేని చిన్నీకి ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ అని తెలిపారు.

Also Read:Jharkhand: జార్ఖండ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యం.. 5 గురు పిల్లలకు హెచ్ఐవి పాజిటివ్‌.!

గెలవగానే స్పీడ్ బోటు మాదిరి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు.. ఇప్పుడు చిల్లులు పడ్డ చెక్క నావ మాదిరి మారాడు.. బందరు గొడుగుపేట వేంకటేశ్వర స్వామి చాలా మహిమ కలిగిన దేవుడు.. గతంలో టీడీపీ హయాంలో కూడా ఆ దేవుడి భూమి కొట్టేయాలని ప్రయత్నాలు చేశారు.. అందుకు సహకరించిన ఓ పెద్దాయన అనారోగ్యానికి గురయ్యాడు.. ఎంపీ చిన్ని కూడా ఆ స్వామి ఆస్తులపై కన్నేయగానే ఇదంతా మొదలైంది.. గొడుగుపేట స్వామి ఆస్తులు ముట్టుకోవడంతో చిన్నీకి ఈ పరిస్థితి వచ్చిందని అనిపిస్తోంది.. బూడిద లోకేష్ లాగేశాడు.. జగ్గయ్యపేట నందిగామ దగ్గర ఇసుక ఉన్నా హైదరాబాద్ తోలలేని పరిస్థితి నెలకొందన్నారు. విజయవాడ ఉత్సవ్ లో 11 కోట్లు లాస్ అయ్యాడని తెలిపారు.

Exit mobile version