Site icon NTV Telugu

Ankineedu Prasad: మచిలీపట్నం మాజీ ఎంపీ మృతి.. సీఎం దిగ్భ్రాంతి

Ankineedu Prasad

Ankineedu Prasad

చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం పార్లమెంట్‌ మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్‌ బహద్దూర్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 ఏళ్లు. కోయంబత్తూరులోని స్వగృహంలో ఈరోజు కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం కృష్ణా జిల్లా చల్లపల్లికి తీసుకురానున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. చల్లపల్లిలోని ఎస్‌ఆర్‌వైఎస్‌పీ జూనియర్‌ కళాశాలకు అంకినీడు ప్రసాద్‌ కరస్పాండెంట్‌గా ఉన్నారు. కాగా.. అంకినీడు ప్రసాద్‌ బహద్దూర్‌ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్టు చేశారు.

READ MORE: Muhammad Yunus: రాజకీయ అస్థిరతల మధ్య బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు..!

“చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ మరణం విచారకరం. జమిందారులుగానే కాకుండా, రాజకీయాల ద్వారా కూడా ప్రజలకు సేవ చేసిన అంకినీడు ప్రసాద్… చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అనువంశిక ధర్మకర్తలలో ఒకరిగా ప్రముఖ ప్రాచీన దేవాలయాలను అభివృద్ధికి, నిర్వహణకు కృషి చేశారు. తాను స్థాపించిన విద్యాలయం ద్వారా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎంతోమందికి సాయం చేసి, మానవతావాదిగా, సౌమ్యుడిగా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… అంకినీడు ప్రసాద్ కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

READ MORE: YS Jagan: అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలి: మాజీ సీఎం జగన్

Exit mobile version