తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలు పార్టీలో చేశారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్జీవో సంఘ మాజీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్ అని పేర్కొన్నారు. జగన్ లాంటి వ్యక్తిని మరలా సీఎం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తామన్నారు. వైఎస్ జగన్ గారికి సపోర్టుగా ఉండాలని ఉద్యోగ సంఘ నేతలు పార్టీలో చేరారని వైసీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషిని జనంలోకి తీసుకెళ్తామన్నారు.
Also Read: Operation Sindoor: శభాష్ భారత సైన్యం.. చిటికెడు సింధూరం ఎంత విలువైందో పాకిస్థాన్‌కు అర్థమైంది?
‘మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్. అలాంటి వ్యక్తి ని మళ్లీ సీఎం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. పోలీసులకు సరెండర్ లీవులు ఇవ్వటం లేదు. ఉద్యోగులకు పెండింగులో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలి’ అని ఎన్జీవో సంఘ మాజీ నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ‘వైఎస్ జగన్ గారికి సపోర్టుగా ఉండాలని ఉద్యోగ సంఘ నేతలు పార్టీలో చేరారు. వైసీపీ ఎంప్లాయిస్ వింగ్‌ని మరింత బలోపేతం చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషిని జనంలోకి తీసుకెళ్తాం’ అని వైసీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
