NTV Telugu Site icon

ISRO EX Chairman: ఇస్రో శాస్త్రవేత్తల జీతంపై మాజీ ఛైర్మన్ ఏమన్నారంటే..!

Nayar

Nayar

చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్‌ అయినా విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ దాని పనిలో నిమగ్నమై ఉంది. అయితే భారతదేశాన్ని ఇంతటి చారిత్రాత్మకమైన ఎత్తుకు తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రపంచం మొత్తం సలాం చేస్తుంది. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. ఇంతకు ఇస్రో సైంటిస్టుల జీతం ఎంతో తెలుసా, ఇస్రోలో పనిచేస్తున్న వారి కంటే నాసా సైంటిస్టులు ఎక్కువ సంపాదిస్తున్నారా?. ఈ సత్యాన్ని ఇస్రో మాజీ ఛైర్మన్‌ జి. మాధవన్ నాయర్ బయటపెట్టారు.

Read Also: Medical And Health Department: ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.. సీఎం ఆదేశాలు

ఈరోజు చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని.. ఇస్రో శాస్త్రవేత్తల జీతం అభివృద్ధి చెందిన దేశాల కంటే ఐదు రెట్లు తక్కువగా ఉన్నందున ఈ ఘనత సాధించామని నాయర్ పేర్కొన్నారు. తక్కువ డబ్బుతో ప్రతి మిషన్‌ను పరిష్కరించాలని ఆలోచిస్తామని.. అందుకే శాస్త్రవేత్తలకు తక్కువ జీతం కూడా ఒక కారణమని ఆయన చెప్పారు. నేడు ఇస్రోలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు.. ప్రపంచంలోని అంతరిక్ష కేంద్రాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల కంటే చాలా తక్కువ జీతం పొందుతున్నారని తెలిపారు.

Read Also: MLA Shankar Naik: శంకర్ నాయక్ మాకొద్దు.. సీఎం వద్దకు తీసుకెళ్తానన్న ఎమ్మెల్సీ

ఇస్రోలో కోటీశ్వరులు దొరకరని, అందరూ సాదాసీదాగా జీవిస్తున్నారని, డబ్బు గురించి ఎవరూ ఆందోళన చెందరని, ప్రతి ఒక్కరూ దేశానికి తమవంతు సహకారం అందించాలన్నదే తమ లక్ష్యమని ఇస్రో మాజీ ఛైర్మన్ చెప్పారు. అంతేకాకుండా తాము తమ తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామని, మిషన్‌లో స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తున్నామని దీని కారణంగా బడ్జెట్‌ను నియంత్రించడంలో విజయం సాధిస్తామని నాయర్ పేర్కొన్నారు. చంద్రయాన్-3 ద్వారా భారతదేశం కొత్త చరిత్ర సృష్టించిందని.. అయితే ఈ మిషన్ మొత్తం బడ్జెట్ 615 కోట్లు ఖర్చు చేశామని.. ఇప్పుడున్న బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కూడా ఇంతే ఖర్చు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Show comments