ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ ఏసీబీ కస్టడీ విచారణ ఏడవరోజు ముగిసింది. 6గంటల పాటు శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు.. ఆదిత్య అండ్ ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులను విచారించారు. అక్రమ ఆస్తులు, బినామీలపై ఏసీబీ ఆరా తీసింది. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్ పేరు మీద భారీగా ఆస్తులు గుర్తించారు. కుటుంబసభ్యులతో పాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులు గుర్తించింది ఏసీబీ.
Read Also: Delhi: అద్వానీతో బీజేపీ అగ్రనేతల భేటీ
మరోవైపు.. రేపటితో 8వ రోజు శివబాలకృష్ణ కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో.. మరో 5 రోజులు శివ బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరనుంది ఏసీబీ. జరిగిన విచారణలో ఆయన ఆస్తుల మీద ఆరా తీశామని అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హెచ్ఎండీఏ, రెరా ఉద్యోగులను పిలిచి విచారణ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడుతో కలిసి పనిచేసిన ఉద్యోగులకు నోటీసులిచ్చి విచారించామని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Teeth: పసుపు పచ్చని పళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి మెరిసిపోతాయి..!
