Amjad Basha PA Arrested: కడప శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మాధవిపై సోషల్ మీడియా వేదికగా చేయబడిన పరువునష్టం వ్యాఖ్యల కేసులో, కడప వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబరు 25న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసుల రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు, తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే పోస్టులు వెలువడ్డాయని, ఆ పోస్టులు ప్రచారం చేయబడ్డాయని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తులో ఫేస్‌బుక్ ద్వారా ప్రచారంలో ఉన్న పోస్టులను నిర్వహించిన పేజీలను గుర్తించి, 15 ఫేస్‌బుక్ పేజీలను తొలగించడమైనది. సోషల్ మీడియా వేదికపై అసత్య ప్రచారాన్ని గమనించి, సంబంధిత అభియోగులను అరెస్ట్ చేయడమైనది. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ బాషా వ్యక్తిగత సహాయకుడు ఖాజాను హైదరాబాద్ నగరంలో అరెస్ట్ చేసి, కడపకు తీసుకువచ్చిన పోలీసులు.. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో విచారణకు తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఇతర ప్రమేయాలున్న అనుమానాల మేరకు దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ అరెస్ట్ వ్యవహారం కాకరేపుతోంది.. మరోవైపు, రాజకీయ కక్షలో భాగంగానే అధికార పార్టీకి చెందిన నేతలు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను.. వారికి సంబంధించిన వారిని అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు..
Read Also: Raju Gari Gadhi 4: మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన ‘రాజుగారి గది’.. సినిమా ఎప్పుడు వచ్చేదంటే?
