Site icon NTV Telugu

Vinod Kambli: చిక్కుల్లో మాజీ క్రికెటర్ వినోద్‌ కాంబ్లీ.. భార్యను వేధిస్తున్నాడా?

Vinod Kambli

Vinod Kambli

Vinod Kambli: కొంతమంది క్రికెటర్లు వృత్తిపరంగా రాణిస్తారు.. వ్యక్తిగతంగా ఫెయిలవుతారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఈ లిస్టులో చేరి చాలా కాలమైంది. మరోసారి ఆయన చిక్కుల్లో పడ్డారు. వినోద్ తాగి వచ్చి.. తనను కొడుతున్నాడనీ, తిడుతున్నాడనీ.. ఆయన భార్య ముంబై, బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి సబర్బన్ బాంద్రాలోని దంపతుల ఫ్లాట్‌లో తన భార్యను దుర్భాషలాడి, దాడి చేసిన ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో కాంబ్లీ వంట పాన్ హ్యాండిల్‌ని తనపైకి విసిరాడని, దీంతో ఆమె తలకు గాయమైందని అతని భార్య ఆండ్రియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 1:30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Hotel Room: హోటల్ రూం ఇవ్వనందుకు కాళ్లతో తన్నుతూ.. బీభత్సం

పోలీసుల వద్దకు రాకముందే కాంబ్లీ భార్య భాభా ఆసుపత్రిలో చికిత్స పొందిందని ఆయన తెలిపారు.కాంబ్లీ భార్య వాంగ్మూలం ఆధారంగా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 324, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.సోదాలు కొనసాగుతున్నాయని, అయితే ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

Exit mobile version