Site icon NTV Telugu

T20 World Cup: ‘టీ20 ప్రపంచకప్‌ గెలవాలంటే..’ కోచ్‌ ద్రవిడ్‌కు ప్రత్యేక సలహా ఇచ్చిన మాజీ క్రికెటర్..

Navajyoth

Navajyoth

టీమిండియా టార్గెట్ టీ20 వరల్డ్ కప్ గెలవడమే.. ఇప్పటికే రెండు ట్రోఫీలను చేజార్చుకున్న భారత్.. ఈ ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో.. జట్టు బలంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, ఎక్స్ పర్ట్స్ ఇండియా జట్టు ఎలా ఉండాలో వారి అంచణాను చెబుతున్నారు. తాజాగా.. భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ నవజ్యోత్ సింగ్ సింధు కూడా చేరాడు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక సలహా ఇచ్చాడు.

Virat Kohli: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి ఆటగాడిగా విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు..

స్టార్ స్పోర్ట్స్‌లో ఆస్క్ స్టార్ సెగ్మెంట్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సిద్ధూ సమాధానమిస్తూ.. రాహుల్ ద్రవిడ్‌కి నా సూటి సలహా ఏమిటంటే, మీరు ఈ టీ20 ప్రపంచకప్ గెలవాలంటే, ఐదు వికెట్లు తీసిన స్పెషలిస్ట్ బౌలర్‌ను జట్టులో ఉంచాలన్నారు.. అందులో ఎలాంటి రాజీ పడవద్దని ద్రవిడ్‌కు సింధు సూచించారు. కాగా.. ఆయన ఎంపిక చేసిన ఆటగాళ్లలో లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లను జట్టులో స్పిన్నర్లుగా ఉంచారు. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లుగా ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ (అతను ఫిట్‌గా ఉంటే) పేర్లను చెప్పారు.

Jr NTR: వారిపై జూ.ఎన్టీఆర్ అసహనం.. ఇంత కోపంగా చూసి ఉండరు!

కాగా.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 5న న్యూయార్క్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, కెనడా, అమెరికాతో పాటు భారత్‌ గ్రూప్‌-ఏలో ఉన్నాయి. జూన్ 12న న్యూయార్క్‌లో సహ-ఆతిథ్య అమెరికాతో భారత్ తలపడనుంది.

Exit mobile version