Site icon NTV Telugu

YS Jagan Pulivendula Tour: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు..కారణమేంటంటే?

Jagan

Jagan

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దైంది. ఈనెల 21, 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నన్నారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

READ MORE: Kavach: 69 వేల కిలోమీటర్ల నెట్‌వర్క్‌లో.. కేవలం 1500 కిలోమీటర్లకే ‘కవచ్’

కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. తొలుత జూన్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా జూన్ 21 నుంచి అసెంబ్లీ మీటింగ్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలుత ప్రొటెం స్పీకర్‌కు ఎంపిక చేయాల్సి ఉంటుంది. శాసనసభకు ఎక్కువసార్లు ఎన్నికైన, సుధీర్ఘ అనుభవం ఉన్న నేతను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉంది.

Exit mobile version