టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణికి ఘన స్వాగతం పలికేందుకు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. విమానాశ్రయ సిబ్బంది ఎంఎస్కేను లోపలికి అనుమతి లేదంటూ అడ్దకున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే అంటూ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అడ్డుకుంది. ఈ విషయంపై ఎస్పీకి ఎంఎస్కే ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ జోక్యంతో ఎయిర్‌పోర్ట్‌లోనికి ఆయనకు అనుమతి దక్కింది.
Also Read: Shree Charani: సీఎం చంద్రబాబుని కలిసిన క్రికెటర్ శ్రీ చరణి!
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)లోని కీలక వ్యక్తులు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఎంఎస్కే ప్రసాద్ ఆరోపణలు చేశారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఎమ్మెస్కే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీ చరణి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత సహా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్ 2025లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
