Site icon NTV Telugu

IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే?

Indigo Ceo

Indigo Ceo

భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన IndiGoలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. పీపీటర్ ఎల్బర్స్ మార్చి 2026లో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన తరువాత, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ విల్లీ వాల్ష్ ను కొత్త CEOగా నియమించారు. ఇండిగో భారతదేశంలో సుమారు 65% మార్కెట్ షేర్ కలిగిన పెద్ద ఎయిర్‌లైన్. ఇలాంటి కంపెనీలో CEO మార్పు అంటే మొత్తం విమానయాన రంగంపై ప్రభావం ఉంటుంది. కొత్త పాలసీలు, వ్యూహాలు వస్తాయి.

Also Read:CM Chandrababu: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇక, ప్రతి నెల ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’

ఎవరు ఈ విల్లీ వాల్ష్?

విల్లీ వాల్ష్ అంతర్జాతీయ విమానయాన రంగంలో అనుభవజ్ఞుడు. ప్రస్తుతం International Air Transport Association (IATA) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ముందుగా British Airways CEOగా పనిచేశారు. 2026 జూలై 31 వరకు IATAలో పని చేసి, ఆగస్టు 2026లో ఇండిగోలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండిగో ఇప్పుడు గ్లోబల్ స్థాయి అనుభవం ఉన్న నాయకుడిని తీసుకువచ్చింది.

వృత్తి ప్రయాణం

1979లో Aer Lingusలో కేడెట్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించారు.
2001లో Aer Lingus CEO అయ్యారు.
2005లో British Airways (BA) CEOగా నియమితులయ్యారు (Rod Eddington తర్వాత).
2011లో BA, Iberia విలీనం ద్వారా International Airlines Group (IAG) ఏర్పాటు చేశారు. IAG CEOగా 2020 వరకు కొనసాగారు.
2021 ఏప్రిల్ నుంచి IATA (International Air Transport Association) Director Generalగా పని చేస్తున్నారు (ఇప్పటికీ కొనసాగుతోంది).
British Airwaysను ఆర్థిక సంక్షోభం (2008-09), హ్యూమన్ రిసోర్స్ సమస్యలు, సహజ విపత్తుల మధ్య నడిపించారు.
IAG ద్వారా యూరప్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో ముఖ్యమైన విలీనాలు, జాయింట్ బిజినెస్ వెంచర్లు చేశారు.
రిటైర్‌మెంట్ తర్వాత IATAలో గ్లోబల్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ పాలసీలు, సేఫ్టీ, సస్టైనబిలిటీ విషయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. భారత్ ఎయిర్‌లైన్ మార్కెట్ గురించి కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు (ఉదా: 2025లో ఢిల్లీ IATA AGM సందర్భంగా).

Exit mobile version