NTV Telugu Site icon

BC Janardhan Reddy: బనగానపల్లె జయహో బీసీ కార్యక్రమంలో వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఫైర్..!

Bc Janardhan

Bc Janardhan

జగన్ రెడ్డి పాలనలో కేవలం రాజకీయ నిరుద్యోగల కోసమే బీసీ కార్పొరేషన్లు పెట్టారు.. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పేరుకే బీసీలు.. అధికార పెత్తనం అంతా వైసీపీ అగ్ర కుల పెద్దలదే అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ, సంక్షేమం కరువైందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read Also: Emmanuel Macron: హెలికాప్టర్లు, జెట్ ఇంజన్ల నుంచి అంతరిక్షం వరకు… భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందాలివే

అయితే, బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయి.. చైర్మన్లు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని మండిపడ్డారు. ఏదో ఆర్భాటంగా బీసీ కార్పొరేషన్లు ఇచ్చారు కానీ.. ఎలాంటి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.. నిధులు లేని బీసీ కార్పొరేషన్లలో మా కులాల అభ్యున్నతి కోసం ఒక్క పని చేయలేకపోతున్నామని బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వైసీపీ నాయకులే ఆవేదన చెందుతున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్‌సీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లు ఛైర్మన్లుగా పేరుకే బీసీలు అని, అధికారం, పెత్తనం అంతా అగ్ర కులాల నాయకులే చెలాయిస్తున్నారని వైసీపీ బీసీ నాయకులే చెబుతున్నారని మాజీ ఎమ్మో్ల్యే బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు.

Read Also: Jaya Prakash Narayana: మధ్యయుగ పైశాచికాన్ని ఇవాళ రాజకీయాలలో చొప్పించారు..

ఇక, టీడీపీ ప్రభుత్వంలో బీసీ కులాల చైర్మన్లకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. గతంలో వాల్మీకీలను ఎస్టీలలో చేర్చేందుకు తీర్మానం చేసిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు.. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులకు బీసీ జనార్థన్ రెడ్డి సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. బీసీలలో ఎన్ని కుల సంఘాలు ఉన్నా.. అంతా ఒకటే బీసీలంతా తెలుగుదేశం కుటుంబం సభ్యులని అభివర్ణించారు. బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన బనగానపల్లె మండల స్థాయి జయహో బీసీ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ నాయకులతో పాటు మండలస్థాయి బీసీ నాయకులు, క్లస్టర్ల యూనిట్ సభ్యులు, మండల పరిధిలోని గ్రామాల టీడీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు, బీసీ అభిమానులు ప్రజలు పాల్గొన్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.