Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ గాదె వెంకటరెడ్డి (85) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటరెడ్డి, శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
సౌమ్యుడు, సహనశీలిగా పేరుగాంచిన వెంకటరెడ్డి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన ఆయన, మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని సీఎం పేర్కొన్నారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
రాజకీయ ప్రస్థానం..
1940 జులై 10న ప్రకాశం జిల్లా పావులూరులో జన్మించిన గాదె వెంకటరెడ్డి, న్యాయశాస్త్రం అభ్యసించారు. ప్రజాసేవపై ఆసక్తితో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 1967లో పర్చూరు నుండి తన 27వ ఏటనే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991 (ఉప ఎన్నిక), 1994లో పర్చూరు నుండి, అలాగే 2004, 2009లలో బాపట్ల నియోజకవర్గం నుండి విజయం సాధించారు.
నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖతో పాటు పలు కీలక శాఖల మంత్రిగా ఆయన సమర్థవంతంగా సేవలందించారు. అనంతరం ఆయన టీడీపీ, వైఎస్సార్సీపీల్లోనూ కొనసాగారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!