Site icon NTV Telugu

SC Classification: ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

Pm

Pm

Central Committee: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయ శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ సర్కార్ జీవో విడుదల చేసింది.

Exit mobile version