కప్పలను పాములు మింగడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ కప్పే పామును అమాంతం మింగడం ఎప్పుడైనా చూశారా? అదేలా సాధ్యం అనుకుంటున్నారు కాదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఓ కప్ప పామును మింగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఓ కప్ప తనను మింగడానికి వచ్చిన పాముకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తానే ధైర్యంగా పాముతో పోరాడి మింగేసింది. ఆ దృశ్యం సంబందించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.. ఇది వింతగా అనిపిస్తున్న అదే నిజం మీకు క్లారిటి రావాలంటే మాత్రం వీడియోను చూడాల్సిందే.
ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెద్ద కప్ప కనిపిస్తుంది.. అంతేకాదు ఒక పాము పిల్లను నోట కరుచుకొని మింగే ప్రయత్నం చేస్తుంది.. ఆ పాము పిల్ల గిల గిల లాడుతూ అరుస్తూ కనిపిస్తుంది.. మెలికలు తిరుగుతూ నోరు తిరిచి అరవడం వీడియోలో చూడొచ్చు. తప్పించుకునే దారిలేక పాము అవస్థలు అన్నీఇన్నీ కావు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..