భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గూడెం అయిన ఎర్రబోడు గ్రామంలో మడకం తుల తను సాగు చేసుకుంటున్న పోడు భూములలో చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ ప్లాంటేషన్ మొక్కలు వేశాడు. ఈరోజు ఉదయం రోజులాగానే తన పొలంలో పశువుల మేపుతున్న క్రమంలో అటువైపు వెళుతున్న ఫారెస్ట్ రేంజర్స్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు మడకం తులాను హెచ్చరించటంతో అక్కడ చోటు చేసుకున్న గొడవ కాస్త ఘర్షణకు దారి తీయడంతో ఆవేశంతో తన చేతిలో ఉన్న కోడవలతో శ్రీనివాసరావుపై దాడి చేయగా అక్కడి నుంచి తప్పించుకున్న సెక్షన్ ఆఫీసర్ రామారావు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయాలు ఆయ్యాయి.
Also Read : APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కొత్త నాన్ ఏసీ స్లీపర్ బస్సు చూశారా?
దీంతో.. శ్రీనివాసరావుకు ఒళ్లంతా రక్తస్రావం అయింది. అయితే.. వెంటనే రేంజర్ శ్రీనివాసరావుని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొత్తగూడెం నుంచి ఖమ్మం తరలించారు. అయితే అక్కడ శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే గ్రామంలో గత ఆరు నెలలుగా ఏదో ఒక రోజు పోడు వివాదం వివాదాస్పదమవుతూనే ఉంది. రెండు నెలల క్రితం ఇదే శ్రీనివాసరావు గిరిజన మహిళలపై తన బెల్టుతో దాడి చేయడం వివాదాస్పదమైంది. ఇదిలా ఉంటే.. భద్రాద్రి… శ్రీనివాస్ మృతి పట్ల తీవ్రంగా ఖండించిన టీజీవో ప్రెసిడెంట్ వెంకట్ పుల్లయ్య.. ఈ ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడినవారికి కఠినంగా శిక్షించాలన్నారు.
Also Read : Vodafone Idea: భారీగా యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా
ప్రభుత్వం అధికారులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మరో పక్క ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఎర్రబోరు గ్రామంలో గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఫారెస్ట్ సిబ్బందిలో ఆందోళన కలిగించింది. ఫారెస్ట్ భూములను కాపాడటానికి వెళ్తున్న తమపై దాడులు సాగుతున్నాయని తమకి ఆయుధాలు ఇవ్వటమే సరైన మార్గమని ఫారెస్ట్ సిబ్బంది అంటున్నారు.
