తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో జరిగిన ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్, టీడీపీ నేత రాకేష్ చౌదరి చనిపోయారు. పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తుండటంతో.. వాటిని తరిమేందుకు రాకేష్ వెళ్లగా అవి తిరగబడ్డాయి. ఓ ఏనుగు దాడి చేయడంతో 33 ఏళ్ల రాకేష్ చౌదరి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు తొండంతో చెట్ల కేసి కొట్టి.. ఆపై నేలపై వేసి కాలితో తొక్కడంతో మృతి చెందారు. ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతితో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read: Vaikuntha Dwara Darshan: శ్రీవారి ఆలయంలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు!
నారావారిపల్లె, భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో గజరాజుల జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ సాయంతో రెండు కిలోమీటర్ల పరిదిలో అధికారులు పరిశీలించారు. ఏనుగుల జాడ తెలియకపోవడంతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భాకరాపేట నుంచి ఏనుగుల మంద రెండుగా విడిపోయింది. ఓ గుంపు కళ్యాణి డ్యామ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బి.కొంగరవారిల్లి పరిసర ప్రాంతాల్లో మరో గుంపు సంచరిస్తున్నట్లు తెలిసింది. దాడికి పాల్పడిన గుంపులో 5 నుంచి 6 ఏనుగులు ఉన్నాయని ఎఫ్ఆర్వో మాధవి తెలిపారు. ప్రత్యేక బృందాలతో కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నామన్న ఆమె చెప్పారు.