Site icon NTV Telugu

Vikram Misri: పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది

Mistri

Mistri

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం నిన్న రాత్రి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి మిస్రీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అర్థరాత్రి 1. 05 నుంచి 1. 30 మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగింది.. పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టాం..

Also Read:Tollywood : ఆపరేషన్ సింధూర్ పై సినీ తారల ఎమోషనల్ ట్వీట్స్

కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను ప్రోత్సహిస్తుంది.. ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది.. 2025 ఏప్రిల్ 22న, లష్కరేకు చెందిన పాకిస్తాన్, పాకిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో భారతీయ పర్యాటకులపై దాడి చేశారని మీ అందరికీ తెలుసునని అన్నారు. ఉగ్రవాదులు 26 మంది భారతీయులను, ఒక నేపాలీ పౌరుడిని చంపారు. 26/11 తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద సంఘటన ఇది. జమ్మూ కశ్మీర్ లో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి.. కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు దాడి చేశారు అని వెల్లడించారు.

Also Read:Operation Sindoor Live Updates: పాక్కి వెన్నులో వణుకు పుట్టించిన భారత్.. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్.. లైవ్ అప్డేట్స్..

ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుంది.. ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉంది.. లాష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసింది.. దాడి చేశామని సోషల్ మీడియాలో టీఆర్ఎఫ్ ప్రకటించింది.. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుంది.. పాకిస్తాన్ పై దౌత్య, వాణిజ్య పరమైన ఆంక్షలు విధించాం.. చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది.. పహల్గామ్ ఉగ్రదాడితో దేశమంతా రగిలిపోయింది.. భారత్ పై పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉంది.. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెర్రరిస్టులకు కేంద్రస్థానంగా నిలిచింది.. పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

Exit mobile version