IND vs BAN Test Series Bangladesh Team: సెప్టెంబర్ 19 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్ కింద ఆడబోయే ఈ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంలో పాల్గొన్న ఆటగాళ్లే ఉండడం గమనార్హం. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) జట్టులో ఒక అన్ క్యాప్డ్ బ్యాట్స్‌మన్ కు స్థానం కల్పించింది. ఇక షోరీఫుల్ ఇస్లాం గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. బోర్డు తొలిసారిగా జకర్ అలీని టెస్టు జట్టులోకి తీసుకుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే.
Sanjauli Mosque : సిమ్లాలోని వివాదాస్పదమైన మసీదును కూల్చేందుకు రంగం సిద్ధం
సెప్టెంబరు 19 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టు ఆగస్టు 15న చెన్నై చేరుకుంటుంది. భారత ఆటగాళ్లు ఈరోజు (సెప్టెంబర్ 12 )న చెన్నైలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాగా, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇక తాజాగా ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టు ఇలా ఉంది.
IPL 2025-RCB: అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ: మాజీ క్రికెటర్
బంగ్లాదేశ్ జట్టు : నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ , షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, తస్కిన్ అహ్మద్ , హసన్ మహమూద్, నహిద్ రానా, తైజుల్ హసన్, . జాయ్, నయీమ్ హసన్ మరియు ఖలీద్ అహ్మద్.