Site icon NTV Telugu

MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తు..

Ap Dsc

Ap Dsc

MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి వేరే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ల విడుదల చేయనున్నారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి అప్పాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ పూర్తి. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

President Murmu: నేడు ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము

మొత్తంగా 16347 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీ భర్తీ చేయనున్నారు.

Kalki 2898 AD Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ రివ్యూ!

Exit mobile version