NTV Telugu Site icon

Agricultural Development: లక్ష కోట్లతో వ్యవసాయ అభివృద్ధి పథకాలకు ఆమోదం!

Money

Money

Agricultural Development: తాజాగా కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి రూ. 1 లక్ష కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాల విషయానికి వస్తే.. ‘PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PM-RKVY)’ , ‘కృషి ఉన్నతి యోజన (KY)’. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి PM-RKVY, స్వయం సమృద్ధి కోసం ఆహార భద్రత సాధించడానికి కృషి ఉన్నతి యోజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు వ్యవసాయ పథకాలకు మొత్తం రూ.1,01,321.61 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Also Read: Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!

ఇంకా ఎడిబుల్ ఆయిల్ నూనె గింజలపై జాతీయ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకంపై వచ్చే ఆరేళ్లకు అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రూ.10,103 కోట్లు ఖర్చు చేస్తారు. 2022-23 సంవత్సరంలో ప్రాథమిక నూనెగింజల ఉత్పత్తిని 3.9 కోట్ల టన్నుల నుంచి 2030-31 నాటికి 6.97 కోట్ల టన్నులకు పెంచడమే మిషన్ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఇది కాకుండా మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ భాష హోదా కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Also Read: Vande Bharat Train: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. భయపడిపోయిన ప్రయాణికులు!

Show comments