NTV Telugu Site icon

Current Bill: కేవలం 14 యూనిట్లకు కరెంట్ వాడకానికి వేలల్లో బిల్లు.. వైరల్..

Current Bil

Current Bil

ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్‌లు ఉన్నప్పుడు, సాధారణంగా మీ కరెంట్ బిల్లు ఎంత ఉంటుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుండి 500 మించి రాదు. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో చూస్తే షాక్ అవుతారు. మండుటెండలో షాపు యజమానికి చెమటలు పట్టడమే కాకుండా., ఇలాంటి కరెంటు బిల్ చూసి గుండె ఆగెంతపని అయ్యింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే..

Also Read: Shakib Al Hasan: కాస్త డాక్టర్స్ కు చూపించండయ్యా.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేసిన బంగ్లా స్టార్ ప్లేయర్‌..

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో అడ్డగట రాజశం అనే దుకాణదారుడికి ఫ్యూజ్లు ఎగిరిపోయో బిల్లు వచ్చింది. నెలవారీ బిల్లు మొత్తం 200 రూపాయలు వచ్చే షాప్ కి.. కేవలం 14 యూనిట్లు మాత్రమే ఉపోయోగించుకున్న, రూ. 60701 ల కరెంటు బిల్ వచ్చింది. ఈ దెబ్బ అతనికి అతడికి మైండ్ బ్లాంక్ అయింది. ఇందుకు సంబంధించి ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లుపై ట్రాన్స్‌కో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కు ఫిర్యాదు చేశామన్నారు.