Football Match: మైదానం పక్కనే ఆ పనికానిచ్చేసిన ప్లేయర్.. చివరకు ఏమైందంటే? (వీడియో)
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన
- మైదానంలో మూత్ర విసర్జన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Footballer Sebastian Munoz Urinates On Field: మ్యాచ్ మధ్యలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ వేటుకు గురయ్యాడు. ఈ ఘటన పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో చోటుచేసుకుంది. పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో భాగంగా ఆదివారం అట్లెటికో అవాజున్, కాంటోర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 71వ నిమిషంలో కాంటోర్సిల్లో గోల్‌కీపర్ లుచో రూయిజ్ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్‌ను ఆపేసి.. అతడికి వైద్య బృందం ప్రాథమిక చికిత్స చేసింది. అదే సమయంలో ఆటగాళ్లు అందరూ గోల్ కీపర్ వద్ద ఉండగా.. అవాజున్ జట్టు ప్లేయర్ సెబాస్టియన్ మునోజ్ మాత్రం ఓ పక్కకు వెళ్లిపోయి మూత్ర విసర్జన చేశాడు.
సెబాస్టియన్ మునోజ్ చేసిన పనిని గుర్తించిన కాంటోర్సిల్లో ఎఫ్‌సీ జట్టు సభ్యులు రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు. వీడియో పరిశీలించిన రిఫరీ.. మునోజ్‌కు రెడ్ కార్డు చూపించాడు. రిఫరీ నిర్ణయంతో మునోజ్ షాక్‌కు గురయ్యాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి మునోజ్ మైదానం వదిలి బయటకు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ 0-0 తేడాతో ముగిసింది. మునోజ్ మూత్ర విసర్జనకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
Also Read: MS Dhoni: రెండో బెస్ట్ వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ.. టాప్‌లో ఎవరంటే? అస్సలు ఊహించరు
ఆటగాళ్లు మైదానంలో మూత్ర విసర్జన చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలామంది ప్లేయర్లు అలానే చేశారు. మాజీ అర్సెనల్ గోల్ కీపర్ జెన్స్ లెమాన్ ఒకసారి అడ్వర్టైజింగ్ హోర్డింగ్ పక్కన మూత్ర విసర్జన చేశాడు. ప్రత్యర్థి ప్లేయర్స్, రిఫరీ అతనిని గుర్తించేలోపు మైదానంలోకి తిరిగి వచ్చాడు. 1990లో ప్రపంచకప్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ మాజీ గోల్‌కీపర్ లినెకర్ కూడా మూత్ర విసర్జన చేశాడు. పొట్ట ఉబ్బరంతో అతడు పనికానిచ్చేశాడు. అయితే ఈ ఇద్దరు వేటుకు మాత్రం గురికాలేదు. దురదృష్టవశాత్తూ సెబాస్టియన్ మునోజ్ మాత్రం దొరికిపోయాడు.
𝐄𝐥 𝐟𝐮́𝐭𝐛𝐨𝐥 𝐬𝐮𝐝𝐚𝐦𝐞𝐫𝐢𝐜𝐚𝐧𝐨 𝐧𝐮𝐧𝐜𝐚 𝐝𝐞𝐣𝐚𝐫𝐚́ 𝐝𝐞 𝐬𝐨𝐫𝐩𝐫𝐞𝐧𝐝𝐞𝐫
🇵🇪 Cantorcillo vs Atlético Awajun de Copa Perú
🚽 Sebastián Muñoz (Atlético Awajun) es expulsado ¡¡por ponerse a orinar en el saque de esquina en pleno partido!! pic.twitter.com/Blve6VFIGS
— Miguel Ángel García (@Miguelin_24_) August 18, 2024
తాజావార్తలు
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!