NTV Telugu Site icon

Football Match: మైదానం పక్కనే ఆ పనికానిచ్చేసిన ప్లేయర్.. చివరకు ఏమైందంటే? (వీడియో)

Football Match Urine

Football Match Urine

Footballer Sebastian Munoz Urinates On Field: మ్యాచ్ మధ్యలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ వేటుకు గురయ్యాడు. ఈ ఘటన పెరూ థర్డ్‌ డివిజన్ పోటీల్లో చోటుచేసుకుంది. పెరూ థర్డ్‌ డివిజన్ పోటీల్లో భాగంగా ఆదివారం అట్లెటికో అవాజున్, కాంటోర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 71వ నిమిషంలో కాంటోర్సిల్లో గోల్‌కీపర్‌ లుచో రూయిజ్ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్‌ను ఆపేసి.. అతడికి వైద్య బృందం ప్రాథమిక చికిత్స చేసింది. అదే సమయంలో ఆటగాళ్లు అందరూ గోల్‌ కీపర్‌ వద్ద ఉండగా.. అవాజున్ జట్టు ప్లేయర్ సెబాస్టియన్ మునోజ్ మాత్రం ఓ పక్కకు వెళ్లిపోయి మూత్ర విసర్జన చేశాడు.

సెబాస్టియన్‌ మునోజ్ చేసిన పనిని గుర్తించిన కాంటోర్సిల్లో ఎఫ్‌సీ జట్టు సభ్యులు రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు. వీడియో పరిశీలించిన రిఫరీ.. మునోజ్‌కు రెడ్‌ కార్డు చూపించాడు. రిఫరీ నిర్ణయంతో మునోజ్ షాక్‌కు గురయ్యాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి మునోజ్‌ మైదానం వదిలి బయటకు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌ 0-0 తేడాతో ముగిసింది. మునోజ్‌ మూత్ర విసర్జనకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: MS Dhoni: రెండో బెస్ట్‌ వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోనీ.. టాప్‌లో ఎవరంటే? అస్సలు ఊహించరు

ఆటగాళ్లు మైదానంలో మూత్ర విసర్జన చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలామంది ప్లేయర్లు అలానే చేశారు. మాజీ అర్సెనల్ గోల్ కీపర్ జెన్స్ లెమాన్ ఒకసారి అడ్వర్టైజింగ్‌ హోర్డింగ్‌ పక్కన మూత్ర విసర్జన చేశాడు. ప్రత్యర్థి ప్లేయర్స్, రిఫరీ అతనిని గుర్తించేలోపు మైదానంలోకి తిరిగి వచ్చాడు. 1990లో ప్రపంచకప్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ మాజీ గోల్‌కీపర్ లినెకర్ కూడా మూత్ర విసర్జన చేశాడు. పొట్ట ఉబ్బరంతో అతడు పనికానిచ్చేశాడు. అయితే ఈ ఇద్దరు వేటుకు మాత్రం గురికాలేదు. దురదృష్టవశాత్తూ సెబాస్టియన్ మునోజ్ మాత్రం దొరికిపోయాడు.