NTV Telugu Site icon

Hyderabad: పలు రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. వెలుగులోకి దారుణాలు

Hotel

Hotel

హోటల్స్ లో ఫుడ్ తింటున్నారా? అయితే మీరు అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్టే. హైదరాబాద్ నగరంలో పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దారుణాలు వెలుగుచూశాయి. గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్ లోని క్షత్రియ ఫుడ్స్, తుర్కయంజాల్ లోని హోటల్ తులిప్ గ్రాండ్ లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

Also Read:Surya : ‘రెట్రో’ నుంచి మరో సాంగ్ విడుదల

వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్ లో ఎలుకలు, బొద్ధింకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కుకింగ్ ఆయిల్ ని రిపీటెడ్ గా వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కిచెన్ లో పనిచేస్తున్న వారు పాన్ మసాలా, గుట్కాలు నములుతూ వంటలు చేస్తున్నట్లు గుర్తించారు. హోటల్ తులిప్ గ్రాండ్ లో కుళ్ళిపోయిన చికెన్ వాడుతున్నట్లు గుర్తించారు. హోటల్ నిర్వాహకులు గడువు దాటుతున్న మష్రూమ్స్, ఐస్ క్రీమ్స్ ను స్టోర్ చేశారు. క్షత్రియ ఫుడ్స్ నిర్వాహకులు నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. కిచెన్ లో భారీగా ఈగలు ఉన్నాయని అధికారులు తెలిపారు.