Site icon NTV Telugu

Food Poison : శ్రీ చైతన్య రెసిడెన్సీ కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 70 మంది విద్యార్థినిలకు అస్వస్థత..

Sri Chaitanya College

Sri Chaitanya College

Food Poison : తాజాగా కరీంనగర్ పట్టణంలోని మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్సి కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ ఆయన ఆహారం తిని కళాశాలలోని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో చైతన్య రెసిడెన్స్ కాలేజీ యాజమాన్యం నుండి విద్యార్థులను అంబులెన్స్ లో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న సమయం లో పెట్టిన భోజనంలో విద్యార్థులు సాంబార్ తినడంతో వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు.

T20 World Cup Final: ఎప్పటికీ మర్చిపోలేని విజయం: రామ్‌ చరణ్‌

అయితే వెంటనే విషయాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం విద్యార్థినులకు సకాలంలో సరైన మాత్రలు ఇవ్వడంతో 20 మంది విద్యార్థులకు హాస్టల్లోనే ఉంచి వైద్యాన్ని అందించారు. ఇక తీవ్రంగా అస్వస్థకు గురైన 20 మంది విద్యార్థినిలను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Exit mobile version