NTV Telugu Site icon

Karnataka: పెళ్లి భోజనాలు చేసి ఆసుపత్రి పాలైన 150 మంది

Food

Food

Food Poison at Wedding Party in Karnataka: పెళ్లి అనగానే చాలా మంది వధూవరుల గురించి కాకుండా అక్కడ వండే వంటకాల గురించి ఆలోచిస్తారు. రకరకాల పుడ్ ఐటమ్స్ ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకంగా తినడం కోసం వెళ్లే వారు కొందరు ఉంటారు. కుటుంబ సమేతంగా కూడా పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి అనంతరం భోజనాల దగ్గరకు వెళతారు. అయితే శుభకార్యం జరిగిన పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి భోజనాలు తిని 150 మంది ఆసుపత్రి పాలయ్యారు. కర్ణాటకలోని బెలగావిలో ఈ ఘటన జరిగింది. హిరేకోడిలోని చెకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. బంధు, మిత్రులతో పాటు గ్రామంలోని చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకకు హాజరైన చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. భోజనం చేసిన రెండు గంటల తర్వాత వీరందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వీరందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేపించారు.  భోజనాల్లో కల్తీ జరగడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వంట పదార్థాలను, అలాగే వాటర్ ని కూడా  పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స అందించడం కోసం  గ్రామంలోని ఎమర్జెన్సీ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. భోజనాలు తినడం వల్ల అస్వస్థతకు గురైన వారందరూ మొదట బెలగావిలో ఉన్న హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు.

Also Read: Metro Train: మెట్రోలో అమ్మాయిలు అలా చేశారేంటి?.. షాకై చూసిన ప్రయాణీకులు

మొదట కొంత మంది చేరగా తరువాత చాలా మంది ఇదే విధంగా చేరడంతో హాస్పటల్ సిబ్బంది ఎమర్జెన్సీగా కేసుగా భావించి వారికి చికిత్స అందించారు. దీనికి సంబంధించి అధికారులకు కూడా సమాచారం అందించారు. దీంతో ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు పెళ్లివేడుక జరిగిన చోటుకు వెళ్లి తనిఖీలు చేశారు. ఫుడ్స్ శాంపిల్స్, నీటి నమూనాలను తీసుకొని వాటిని ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ టెస్ట్ ఫలితాలు వచ్చిన తరువాత వంటలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటన లో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పటికే ఆసుపత్రి నుంచి కొంత మంది డిశ్చార్జ్ అయ్యారు. కొంత మంది కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక గ్రామంలో ఏకంగా 150 మంది అనారోగ్యానికి గురికావడంతో  గ్రామంలోని ఒక స్కూల్ లో ఎమర్జెనీ క్లినిక్ ను అధికారులు ఏర్పాటు చేసి బాధితులకు ప్రత్యేక చికిత్స అందించారు. శుభకార్యం జరిగిన పెళ్లి ఇంట ఇలా జరగడం కొంత బాధకమరనే చెప్పాలి.