Midday Meal in Bihar: బల్లి పడిన భోజనం తిన్న 200మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బీహార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భాగల్ పూర్లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులరకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అంతకు ముందు విద్యార్థులు భోజనంలో బల్లి పడిందని ఆ పాఠశాల సిబ్బందికి తెలిపినా వారు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బల్లిపడినా ఆ భోజనమే తినాలంటూ బలవంతం చేశారు. తర్వాత ట్యూషన్‌కు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలిన వారంతా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉపాధ్యాయుడు, సిబ్బంది పాఠశాల సమీపంలోని ఓ వైద్యకేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Chikoti Praveen Meets MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యేతో క్యాసినో కింగ్ భేటీ
ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థికి ప్లేట్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. ఈ విషయాన్ని విద్యార్థులు హెడ్ మాస్టర్ కు చెప్పారు. కానీ, ఆయన దానిని బల్లి కాదని, వంకాయ అని చెప్పాడు. తినకుంటే పస్తులుండాల్సి వస్తుందని.. అదే ఆహారాన్ని తినాలని బలవంతం చేశాడు. దీంతో స్టూడెంట్స్ ఏమీ చేయలేక అదే ఆహారాన్ని తిన్నారు. కాసేపటికే వాంతులతో ఆస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను విద్యా శాఖ సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తు చేపట్టి, వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.