మనలో చాలా మంది అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యవ్వనం అనేది దేవుడు ఇచ్చిన వరం. యవ్వనంగా కనిపించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అందులో ముఖ్యమైనవి చర్మానికి ఎక్కువ పౌడర్‌లను పూయటం అంత మంచిది కాదు. చర్మం నుండి పౌడర్ మరియు దుమ్ము, ధూళి లను వేరు చేయటానికి కాటన్ లేదా పత్తిని వాడటం చాలా మంచిది. నడిచేటప్పుడు సూర్యకాంతికి దూరంగా ఉండండి. దీనివలన చర్మ కణాలు దెబ్బ తినడం, కాన్సర్ రావటం లేదా చర్మంపై ముడతలు వచ్చే అవకాశం ఉంది. కావున వీలైనంతగా సూర్యరశ్మికి దూరంగా ఉండండి. సూర్య కాంతిలో వెళ్ళడానికి ముందుగా సూర్యరశ్మికి బహిర్గతం అయ్యే ప్రదేశాలలో సన్ స్ర్కీన్ లేదా గొడుగుని వాడండి. శరీరంలో అన్ని అవయవాలు వాటి విధులను నిర్వహించడానికి నీరు తప్పక అవసరం. శరీరంలో నీటి స్థాయిలో తగ్గినట్లు అయితే అవయవాల విధులు నిలిపి చేయబడుతాయి.
Also Read : Terror Attack Averted: తప్పిన భారీ ఉగ్రదాడి.. 15 కిలోల పేలుడు పదార్థాలు నిర్వీర్యం
పది గ్లాసుల నీటిని తాగడం వల్ల చర్మ ఉపరితలంపైన ఉండే నిర్జీవ కణాలు ఆరోగ్యవంతమైన కణాలతో మార్చబడి మీరు ఎవ్వనంగా కనబడతారు. వృద్ధాప్యం వచ్చిందా అని చూసేటప్పుడు ముద్దుగా కంటికింద, కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని పరీక్షించి చూడాలి. ఈ భాగంలో వృద్ధాప్యం పైబడి లక్షణాలు ప్రారంభమవుతాయి. మీరు యవ్వనంగా కనిపించడానికి ఈ ప్రాంతాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. యవ్వనంగా ఉన్న బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్న మీరు వయసులో పెద్ద వారిలా కనిపిస్తారు. జుట్టు తెల్లబడిన వెంటనే కలర్ లేదా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్ ఫ్రేమింగ్ చేయించడం వలన కొన్ని సంవత్సరాల వారికి యవ్వనంగా కనబడతారు. ఆరోగ్యకరమైన ఆహారం తినండి మరియు రోజు రాత్రి పడుకోవడానికి ముందు తలని జుట్టును నూనెతో మసాజ్ చేయండి.