Site icon NTV Telugu

Mangli: మంగ్లీపై అసభ్యకర వ్యాఖ్యలు.. మేడిపల్లి స్టార్ అరెస్ట్..

Mangali

Mangali

Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా, కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంగ్లీ స్వయంగ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అవుతున్న మంగ్లీ పాడిన “బాయిలోన బల్లి పలికే” అనే పాటకు డాన్స్ చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు మేడిపల్లి స్టార్ అనే వ్యక్తి. ఆ వీడియోలో మంగ్లీని బూతులు తిడుతూ, పాటను కించపరుస్తూ, ఆమె చెందిన ఎస్టీ సామాజిక వర్గాన్ని నీచంగా అవమానించేలా మాట్లాడాడని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Indrajaal Ranger: AI ఆధారిత మొబైల్ యాంటీ-డ్రోన్ టెక్నాలజీ.. హైదరాబాద్‌లో ‘ఇంద్రజాల్ రేంజర్’ లాంచ్..!

ఈ వీడియో వైరల్ కావడంతో మంగ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఆర్ నగర్ పోలీసులు మేడిపల్లి స్టార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా, షెడ్యూల్డ్ తెగలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగ్లీ ఈ ఘటనపై స్పందిస్తూ, “నా పాటలు ప్రజలకు ఆనందాన్ని ఇస్తాయి కానీ, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి. మహిళగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇలాంటి అవమానాలు సహించలేను. చట్టం తన పని తాను చేస్తుందని నమ్ముతున్నాను” అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో మహిళలు, గిరిజన సామాజిక వర్గాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్.. REDMI 15C 5G భారత్ లాంచ్ కు రంగం సిద్ధం..!

Exit mobile version