ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ద్విచక్ర వాహనాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడంతో.. ప్రతి ఏడాది విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటికే పలు సంస్థలు ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేశాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కూడా ఈవీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ పేరిట ఎలక్ట్రిక్ బైక్‌ను తాజాగా ఆవిష్కరించింది.
భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ‘ఫ్లయింగ్ ఫ్లీ’ బ్రాండ్ కింద రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేయనుంది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 అనేది రెట్రో ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్. ఇది రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ముందువైపు గిర్డర్ ఫోర్క్‌లతో వస్తోంది. ఈ బైక్స్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో రెండు సీట్ల వెర్షన్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇది టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో రానుంది.
Also Read: Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలు ఇవే!
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 సీటు ఎత్తు తక్కువగా ఉంటుంది. రైడర్ సౌకర్యవంతంగా ప్రణయాన్ని ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. సింగిల్ ఛార్జింగ్‌తో 100 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇది మంచి పవర్, టార్క్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6లుక్‌ని రివీల్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. పూర్తి ఫీచర్ల వివరాలు, ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అన్ని డీటెయిల్స్ తెలియరానున్నాయి. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్స్ 2026లో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.