NTV Telugu Site icon

IndiGo Flight: విమానంలో రక్తపు వాంతులు.. అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఇండిగో ఫ్లైట్! చివరికి

Indigo

Indigo

62 Years Old Flyer Vomits Blood On IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని అధికారులు అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అయితే దురదృష్టవశాత్తు 62 ఏళ్ల ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు. ఈ ఘటన ముంబై నుంచి రాంచీ వెళుతున్న ఇండిగో (IndiGo Flight 6E 5093) విమానంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…

62 ఏళ్ల ఓ ప్రయాణికుడు దీర్ఘకాలిక మూత్రపిండాలు మరియు క్షయ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నాడు. సోమవారం ఇండిగో విమానంలో రాంచీకి అతడు బయలుదేరాడు. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే అతడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చి.. విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్‌లో ల్యాండ్‌ చేశారు. వైద్య సహాయం కోసం అతడిని నాగ్‌పుర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: Asia Cup 2023: అభిమానులకు శుభవార్త.. ఉచితంగానే ఆసియా కప్ మ్యాచ్‌లు చూడొచ్చు!

నాగ్‌పూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ బ్రాండింగ్ మరియు కమ్యూనికేషన్స్ డీజీఎం ఏజాజ్ షమీ మాట్లాడుతూ… ‘ప్రయాణికుడిని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడు అప్పటికే మరణించాడు. మృతదేహాన్ని తదుపరి ప్రక్రియల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు’ అని తెలిపారు. గత బుధవారం ఢిల్లీ-దోహా విమానంలో ప్రయాణీకుడిగా ప్రయాణిస్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ పైలట్ గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత రోజు ఇండిగో కెప్టెన్ నాగ్‌పూర్‌లోని బోర్డింగ్ గేట్ వద్ద స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో మరణించాడు. అతను ఆ రోజు నాగ్‌పూర్ నుంచి పూణేకి విమానాన్ని నడపాల్సి ఉంది.