Site icon NTV Telugu

Crime News: అన్నం పెట్టిన చిచ్చు.. రూమ్‌మేట్‌ నోట్లో మట్టి, రాళ్లు కుక్కి చంపేసిన స్నేహితుడు

Crime News

Crime News

Crime News: ఓ వ్యక్తి తన ఆహారాన్ని రూమ్‌మేట్‌ నేలపై విసిరికొట్టాడనే కోపంతో అతనిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. స్నేహితుడిని హత్య చేసిన అనంతరం పెరట్లోకి తీసుకెళ్లి సమాధి చేశాడు. ఆ సమాధిని గమనించిన ఓ సాక్షి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 18 అంగుళాల లోతైన రంధ్రంలో దేహం పాక్షికంగా బయటకు కనిపించడంతో వారు కనుగొన్నారు. పోర్ట్‌పియర్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు 22 ఏళ్ల బ్రయాన్ మార్క్వెజ్‌ తన రూమ్‌మేట్‌ తన ఆహారాన్ని నేలపై విసిరికొట్టి అగౌరవపరిచినట్లు చెప్పాడు. ఈ అవమానానికి తాను వెంటనే స్పందించలేదని.. ఆ రాత్రి తాగి తన రూమ్‌మేట్‌ను ఎదుర్కోవాలనుకున్నాడు. రాత్రి తాగిన అనంతరం రూమ్‌మేట్‌ హిస్మానిక్‌ పక్కటెముకలు, ముఖం కొట్టినట్లు చెప్పాడు. అతడిని నేల మీద పడేశాడు. అతను లేవకుండా పడిపోవడంతో మట్టి, కంకర రాళ్లను బాధితుడి నోట్లో పోశాడు. అనంతరం లేవమని బెదిరించాడు. చాలా సార్లు అరిచినా లేవకపోవడంతో చనిపోయాడని గుర్తించాడు. అప్పుడు మార్క్వెజ్ మృతదేహాన్ని పెరట్లోకి లాగి పాతిపెట్టడానికి లోతు తక్కువగా ఉన్న సమాధిని తవ్వాలని ఎంచుకున్నట్లు చెప్పాడు.

Read Also: Punishment For Drunk and Driving: మందు బాబులకు వినూత్న శిక్ష.. వైజాగ్‌ బీచ్‌ మొత్తం క్లీన్..!

నిందితుడు తానే చంపానని ఒప్పుకున్న అనంతరం ఫిబ్రవరి 12న అతడిని అరెస్ట్‌ చేశారు. అతను అక్రమ వలసదారు అయినందున ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కస్టడీలో ఉన్నాడు. బాధితుడు హిస్పానిక్ 35-45 సంవత్సరాల వయస్సు గలవాడు. అతని ముఖానికి తీవ్రమైన గాయాలు ఉన్నాయి, అలాగే ముక్కు, అనేక పక్కటెముకలు విరిగిపోయాయి. పోలీసులు ఘటనాస్థలంలో రక్తం, పారలు, ప్లైవుడ్, చేతి తొడుగులు, రాళ్ళు, దుప్పటిని కూడా కనుగొన్నారు.

Exit mobile version