Site icon NTV Telugu

Man Dance with Crocodile : అదేం.. నీ గర్ల్ ఫ్రెండ్ కాదురా అయ్యా.. మొసలితో సాల్సా డ్యాన్స్!

Florida Aligator Video

Florida Aligator Video

Man Dance with Crocodile : ఈ మధ్య పాపులర్ అయ్యేందుకు రిస్క్ చేసి మరీ పలు రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియా స్టార్లుగా మారిపోతున్నారు. వాటిని చిత్రిస్తూ కొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒకడు మొసలితో సాల్సా డ్యాన్స్ చేస్తున్న వీడియో నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఫోరిడాకు చెందిన వ్యక్తి ఇలా మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ చేసినట్లు విపరీంగా వైరల్ అవుతోంది. సాధారణంగా మొసలిని చూస్తే మనం భయం పడిపోతాం. అవును.. ఎందుకంటే దాని రూపం అలా ఉంటుంది. అదీ క్రూర జంతువే. నీటిలో ఉంటే మరీను.. బలవంతంగా ఉంటున్నందున దిగే సాహసం చేయరు. కానీ ఇటీవల కొందరు ఫీట్లు చేస్తున్నారు. ఓ మహిళ మొసళ్లతో కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ వీడియోలో అతను దాంతో ఏం చక్కా డ్యాన్స్ చేస్తున్నాడు. మీరు ఆ వీడియోను చూడండి.

Read Also: political heat on currency notes : తెగని నోట్ల పంచాయితీ.. ఆప్, బీజేపీ మధ్యలో కాంగ్రెస్

ఓ సరస్సులో మొసలి ఉంది. అందులో ఒకతను కూడా ఉన్నారు. క్యాజువల్‌గా దిగడమే ఇబ్బంది.. మరీ అలాంటిది దానిని పట్టుకుని ఉన్నారు. ఏకంగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో కొన్ని సెకన్లే ఉన్న.. చూసినవారికే గుండె దడ అనక మానదు. తన తలను మొసలికి ఆనించి మరీ డ్యాన్స్ చేశాడు. కానీ ఆ మొసలి మాత్రం కామ్‌గా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Read Also:PM Modi: కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్

ఈ ఫ్రెండ్ షిప్ ఏంటీ రా బాబు అని యూజర్స్ అనుకుంటున్నారు. అతను ధైర్య సాహసాలు మాత్రం సూపర్ అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం విభేదిస్తున్నారు. ఫ్లోరిడా మ్యాన్ గురించి సెర్చ్ చేస్తే ఇలాంటి వస్తున్నాయని ఒకరు రాశారు. తెల్ల జాతీయులు నల్ల జాతీయుల అంటే భయపడిపోతారని తెలిపారు.

Exit mobile version