Site icon NTV Telugu

Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

Anupama Parameswaran

Anupama Parameswaran

2025 అంటే అనుపమ పరమేశ్వరన్‌దే. ఒక్కటి కాదు రెండు కాదు.. ఆరు సినిమాలతో సందడి చేసింది. అందులో నాలుగు బ్లాక్ బస్టర్సే. డ్రాగన్‌తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను.. బైసన్ వరకు కంటిన్యూ చేసింది. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. కిష్కింధ పురితో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు కంబ్యాక్ అయితే.. కెరీర్ ఎటు పోతుందో తెలియని డైలామాలో పడిపోయిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్‌కు బైసన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. పెట్ డిటెక్టివ్‌తో మలయాళ హీరో షరీఫ్ యూ ధీన్ కు ఇటు హీరోగా, అటు నిర్మాతగా డబుల్ బొనాంజా అందించింది అను.

Also Read : Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

ఫ్లాప్స్‌లో ఉన్న హీరోలను గట్టెక్కించగలిగింది కానీ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది అనుపమ. ఈ ఏడాది ఆమె నటించిన రెండు లేడీ ఓరియెంట్ చిత్రాలు పరదా అండ్ జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ బోల్తా పడ్డాయి. ఇక వీటి జోలికి వెళ్లకూడదు అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా లాస్ట్ ఇయర్ కంప్లీటైన తమిళ ఫీమేల్ సెంట్రిక్ చిత్రం లాక్ డౌన్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ వచ్చింది వెళ్లింది అనే విషయం కూడా తెలియదు. ఇలా ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు బెడిసికొడుతున్నా మరోసారి రిస్క్ చేసేందుకు రెడీ అవుతోందట. తెలుగులో క్రేజీ కళ్యాణం చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రేరణ అరోరా నిర్మించే ఓ సినిమాలో ఫిక్స్ అయ్యింది. అను బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు. రుస్తుమ్, టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ వంటి సినిమాలకు నిర్మాతగా ప్రేరణకు మంచి పేరుంది. షాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ అప్ కమింగ్ ఫిల్మ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని టాక్. మే నుండి మూవీ పట్టాలెక్కబోతోంది. గతంలో షాన్‌ తెరకెక్కించిన ప్రీడమ్ ఎడ్ మిడ్ నైట్ అనే షార్ట్ ఫిల్మ్స్ అనుపమ నటించింది. ఈ లేడీ ఓరియెంట్ ఫిల్మ్‌తోనైనా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు అను ఊపిరిపోస్తుందేమో చూడాలి.

Exit mobile version