Floods Occurred in Godavari Catchment Areas
బంగాళాఖాతంలో వచ్చిన వాయుగుండం వల్ల భారీ వర్షాల తో గోదావరి కి వరద తీవ్రత పెరిగింది. మళ్లీ గోదావరి వరదలతో స్నానాలు గట్టు మునిగింది. అయితే.. మరింత వరద పెరిగితే ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలు మునిగిపోనున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది. గోదావరి పెరుగుతుండడంతో ఇప్పటికే కరకట్ట పక్కనే ఉన్న స్నానాలు గట్టు పూర్తిగా మునిగిపోయింది. గత నెలలో 71 అడుగుల వరకు రావడంతో కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలతో పాటు గోదారమ్మ తల్లి విగ్రహాలు కూడా మునిగిపోయాయి అవి ఇప్పుడిప్పుడే తెరుకున్నాయి. వాటిని శుభ్రం చేసుకునే సరికి చాలా ఖర్చు వచ్చిందని అంటున్నారు పూజారులు. అంతేకాకుండా ఇప్పటివరకు స్థానాల గట్టు వద్ద అధికారులు కరెంటును కూడా ఇవ్వలేదు. నెల రోజులుగా స్నానాల గట్టు వద్ద కరెంట్ లేకుండానే దేవాలయాలు ఉన్నాయి.
దీంతో ఇబ్బందుల కు గురవుతున్నారని దేవాలయం పూజారులు చెప్తున్నారు. అయితే స్థానాలకు వద్ద ఇప్పటికే పోలీసు బందోబస్తు గజ ఈతగాల్లని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. గోదావరి వరద రావడంతో అనేక రహదారులు ముంపుకు గురయ్యాయి. వెంకటాపురం నుంచి భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గడ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ కి వెళ్లే ప్రధానమైన రహదారిపై పలుచోట్ల నీళ్లు చేరాయి. దీంతో అక్కడ రహదారుల మీద వెళ్లే వాహనాలని ఆయా గ్రామాలకు సంబంధించిన యువకులు వాలంటీర్లుగా అవతారం ఎత్తారు. వాలంటీర్ గా ఉన్నవారు రోడ్డుపై నీళ్లలో వాహనాలని జాగ్రత్తగా పంపిస్తున్నారు. నీళ్లలో వెళ్తున్న వాహనాలు కొద్దీగా దారితప్పిన గోదావరిలో కొట్టుకుని పోవాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్లు జాగ్రత్తగా వాహనాలని పాదచారులని వరదల నుంచి రోడ్డుపైకి తరలిస్తున్నారు.