NTV Telugu Site icon

Bhadrachalam: భద్రాచలం సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రంలోకి వరద నీళ్లు..!

Badrachalam

Badrachalam

భద్రాచల రామయ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గోదావరి నదికి భారీ ఎత్తున వరదలు వచ్చిన సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దగ్గర ఉన్న అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ప్రతి ఏడాది జరుగుతుంది. కానీ ఏడాది మామూలు వర్షాలకు కూడా అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ఇదే ప్రథమంగా కనపడుతుంది.

Read Also: Impact of Severe Heatwaves: ఉత్తరాదిలో నిప్పులు కురిపిస్తున్న భానుడు..(వీడియో)

అయితే, నిన్న ( శుక్రవారం) భద్రాచలంలో 5 సెంటి మీటర్ల వర్షం పడడంతో అన్నదాన సత్రంలోకి వరద నీళ్లు వచ్చాయి. ఇక, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ వర్షం పడుతున్న సమయంలో కాలు జారీ డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఈ ఘటన కూడా అప్పుడు అన్నదాన సత్రం దగ్గరే జరిగింది. ఈ కారణం డ్రైనేజీ వ్యవస్థ దెబ్బ తినడం తో ఈ సమస్య ఏర్పడింది.. అన్న దాన సత్రం మూసివేశారు.. ఈ రోజు ప్యాకెట్ల ద్వారా శ్రీరాముడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నదానం చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం గోదావరి నదిపై రక్షణ వలయం కట్టేందుకు ప్లాన్ చేసిన ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు సాగలేదు.. దీంతో చిన్నపాటి వర్షాలకే ఈ వరద ప్రవాహం భద్రాద్రి రామయ్య ఆలయాన్ని ముంచెస్తుంది.