NTV Telugu Site icon

Spain Floods: స్పెయిన్‌లో వరద బీభత్సం.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు

Heavy Rains Spain

Heavy Rains Spain

Spain Floods: స్పెయిన్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు. వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్‌లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ రోడ్లపై కార్లు బొమ్మల్లా కొట్టుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడ వరదల పరిస్థితి నెలకొంది. నీటిలో కారు ప్రవహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే?

అకస్మాత్తుగా వరదలు రావడంతో కొందరు డ్రైవర్లు కూడా తమ కార్లలోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడుతున్నారు. ఈ సమయంలో ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా అక్కడి అధికార యంత్రాంగం నిషేధించింది. ఈశాన్య స్పెయిన్‌లో ఈరోజు కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

ఈ వర్షం తర్వాత చాలా ప్రాంతాలు వరదల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లో కురిసిన వర్షాలకు వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రోడ్లపై నీరు నిండిపోయింది.

Read Also:Viral: ఓరి మీ దుంపలు తెగ.. ఎక్కడినుంచి వస్తాయిరా మీకీ ఐడియాలు

కొన్ని నెలల క్రితం కూడా వర్షాలు, వరదలు స్పెయిన్‌లో వినాశనం కలిగించాయి. అప్పట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మే నెలలో వరదల్లో కార్లు కొట్టుకుపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి.