Site icon NTV Telugu

Flipkart Sale 2025: ఫ్లిప్‌కార్ట్‌లో మరో అవకాశం.. అతి తక్కువ ధరకే iPhone 16 Pro!

Iphone 16 Pro

Iphone 16 Pro

ప్రముఖ ఈ-కామర్స్ (ఆన్‌లైన్‌) షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ముగిసింది. మీరు ఈ ఆఫర్స్ మిస్ అయితే ఎలాంటి చింత అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్‌ మీకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ అక్టోబర్ 4న ప్రారంభమైంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని మీరు స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని ఆఫర్‌లను మనం చూద్దాం.

బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ సమయంలో మీరు iPhone 16 Proని రూ.85,999 కి కొనుగోలు చేయవచ్చు. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ మంచి ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇది ఇతర ప్లాట్‌ఫామ్‌ల కంటే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇది బెస్ట్ డీల్ అనే చెప్పాలి. రూ.43,840 వరకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. iPhone 17 సిరీస్ లాంచ్ అయ్యాక 16 సిరీస్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీపావళి సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: INDW Vs PAKW: పాకిస్థాన్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్.. టాస్‌లో టీమిండియాను మోసం చేసిన మ్యాచ్ రిఫరీ!

బడ్జెట్లో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకుంటే.. మీరు Samsung Galaxy S24 FE మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.29,999కు లభిస్తుంది. Motorola Edge 60 Fusionపై మంచి డీల్ ఉన్నాయి. ఈ ఫోన్ రూ.18,999 కు లభిస్తుంది. Samsung Galaxy S24ని కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. గత సంవత్సరం ప్రారంభించబడిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.38,999కు అందుబాటులో ఉంది. మీకు కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే దీన్ని ప్రయత్నించవచ్చు. నథింగ్ ఫోన్ 3ని రూ.44,999కి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూలైలో రూ.80,000 ధరకు విడుదల చేసింది. ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.56,999కి కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version