Site icon NTV Telugu

Flipkart New Sale 2023: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్.. 5 రోజుల పాటు ఆఫర్ల జాతర! వాటిపై 75 శాతం డిస్కౌంట్స్

Flipkart New Sale

Flipkart New Sale

Flipkart Announce Grand Home Appliances Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఇటీవలి రోజుల్లో వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. అదే ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Flipkart Grand Home Appliances Sale 2023). ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్ ఆగష్టు 14 నుంచి 18వ తేదీ వరకు కొనసాగనుంది. 5 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లకు ఆఫర్ల జాతర ఉంటుంది.

‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో భాగంగా టీవీ, హోమ్ అప్లియెన్సెస్‌పై ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. మీరు స్మార్ట్‌టీవీని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే.. ఈ సేల్ మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీలపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్స్ ఉండనున్నాయి. వాషింగ్ మిషన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. కేవలం రూ. 239 ఈఎంఐతో వాషింగ్ మిషన్లను మీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

Also Read: NEET Result: నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. కుమారుడి మృతిని తట్టుకోలేని తండ్రి..!

ఫ్లిప్‌కార్ట్ నయా సేల్‌లో రిఫ్రిజిరేట్లపై అదిరిపోయే ఆఫర్లు ఉంటాయి. రూ. 791 ఈఎంఐ ఆఫర్లతో రిఫ్రిజిరేటర్లను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఏసీలను రూ. 2,499 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. గీజర్, హీటింగ్ మరియు కూలింగ్ అప్లియెన్సెస్, హోమ్ అప్లియెన్సెస్, మైక్రో వేవ్ ఓవెన్స్ లాంటి వాటిపై కూడా భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఆఫర్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. బ్యాంకు కార్డు ద్వారా షాపింగ్ చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Flipkart New Sale 2023

Exit mobile version