ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ క్రేజీ డీల్స్ తో సేల్ కు రెడీ అయ్యాయి. అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ జరగనుండగా ఫ్లిప కార్ట్ లో గోట్ సేల్ ప్రారంభంకానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు రాత్రి 12 గంటల నుంచి గోట్ సేల్ ప్రారంభం కానుంది. జూలై 12 నుంచి ప్రారంభమై జూలై 17 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో గృహోపకరణ వస్తువులపై 85% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, పవర్ బ్యాంకులు, ప్రింటర్లు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు.
Also Read:Rahul Gandhi: “ఎన్నికల దొంగతనం”, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
గృహోపకరణాలు.. Samsung, Prestige, LG, TCL & SONY నుండి స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ACలు, మరిన్నింటిపై అత్యుత్తమ డీల్‌లను అందిస్తోంది. పీజియన్, మోర్టీన్, మరిన్నింటి నుంచి కిచెన్వేర్, క్లీనింగ్ టూల్స్, ఆర్గనైజర్లపై 70% వరకు తగ్గింపు ఇస్తోంది.
Also Read:HYDRA : హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణల తొలగింపు.. వరదల నివారణకు హైడ్రా చర్యలు
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ లో మీరు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇక్కడ మీరు HDFC, IDFC, Axis బ్యాంక్ కార్డులను ఉపయోగించడంపై 10% వరకు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ టీజర్‌లో ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్‌ను ఆకర్షణీయమైన ధరకు కొనుగోలు చేయవచ్చని చూపిస్తుంది. ఐఫోన్ 16ను రూ.60 వేలకు కొనుగోలు చేయవచ్చు, ఐఫోన్ 16 గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.79,990 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దీనితో పాటు, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై కూడా డీల్స్ అందుబాటులో ఉంటాయి.
Also Read:HYDRA : హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణల తొలగింపు.. వరదల నివారణకు హైడ్రా చర్యలు
ఈ సేల్ లో ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్, ప్రీమియం మొబైల్ ఫోన్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ ను అందిస్తోంది.
– మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ – రూ. 20,999
– CMF ఫోన్ 2 ప్రో – రూ. 17,999
– నథింగ్ ఫోన్ 3a – రూ. 22,999
– శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE – రూ. 35,999
– Moto G85 (8GB RAM) – రూ. 14,999
– రియల్‌మీ P3X 5G – రూ. 11,699
– ఒప్పో K13 5G – రూ. 15,999
– పోకో C75 5G – రూ. 7,699
