NTV Telugu Site icon

Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

Flipkart

Flipkart

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పండగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ-కామర్స్ సంస్థలు పండగ సేల్స్ కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కావాల్సిన ఉద్యోగులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. పండుగల కు భారీ ఆఫర్ లను కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు..

ఈ పండగ సీజన్లో ఏకంగా లక్ష సీజనల్ ఉద్యోగాలను కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. డిమాండ్‌కు అనుగుణంగా ఈ రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయని ఈ సంస్థ తెలిపింది.. ఈ విషయం పై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ ఉద్యోగాల భర్తీ పై ఒక క్లారిటి ఇచ్చారు.. బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు భారీగా ఉంటాయి. ఇది మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్‌లకు ఇ-కామర్స్ యొక్క గొప్పతనాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది..

ఈ సేల్ సమయం లో Flipkart టాప్ బ్రాండ్‌ల ఉత్పత్తుల పై డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రత్యక్ష, పరోక్ష విభాగం లో ఈ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.. గతంలో కన్నా ఎక్కువగా ఉద్యోగాల ను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.. ఈ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ అర్హత సరిపోతుందని తెలిపారు.. ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకొనేందుకు ఫ్లిప్ కార్ట్ అధికార వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..