Site icon NTV Telugu

Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మే 3 నుంచి ఆరంభం!

Flipkart 2024

Flipkart 2024

Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ మే 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబందించి ఫ్లిప్‌కార్ట్‌ తమ వెబ్‌సైట్‌లో బ్యానర్‌లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌లు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. వారం రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందించనుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై రాయితీలు, ఆఫర్లు భారీగా ఉండనున్నాయి.

బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా కార్డులపై ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చు. వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ భారీగా డిస్కౌంట్స్ అందించనుంది.

Also Read: Hardik Pandya: మా ఓటమికి కారణం అదే: హార్దిక్ పాండ్యా

మరోవైపు అమెజాన్ కూడా సేల్‌ను ప్రకటించింది. ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ డే’ సేల్‌ మే 2న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్‌లు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4, వన్‌ప్లస్ 12 ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 3 లాంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా రాయితీలు ఉన్నాయి.

 

Exit mobile version