పండుగలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ 2023ని నిర్వహించనుంది.. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ సేల్‌లో ఉండనున్న డిస్కౌంట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఓ హింట్ ఇస్తూనే ఉంది..
ఇటీవల దసరా కానుకగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన సేల్‌లో భాగంగా ఒక రోజే ఏకంగా 1.4 బిలియన్ల మంది యూజర్లు ఫ్లిప్‌కార్ట్ సైట్‌ను సందర్శించారు. అక్టోబర్ 26 నాటికి ఏకంగా 1 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాలి సేల్ పేరుతో మరో సేల్ నిర్వహిస్తోంది. నవంబర్ 2వ తేదీన మొదలుకానున్న ఈ సేల్ నవంబర్ 11 వరకు కొనసాగనుంది.. పది రోజుల్లో పలు వస్తువుల పై భారీ ఆఫర్స్ ను అందించనుంది ఫ్లిప్ కార్ట్..
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లపై ఏకంగా 45 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. స్మార్ట్ ఫోన్స్‌పై 45 శాతం డిస్కౌంట్స్ అందిస్తుండగా, స్మార్ట్ వాచ్‌లపై ఏకంగా ర80 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కోటక్ బ్యాంక్‌పై కూడా 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు.. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేసినా డిస్కౌంట్ అందించనున్నారు. పేటీఎం యూపీఐ, వ్యాలెట్ లావాదేవీలపై కూడా తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.. ఇక ఫ్లిప్ కార్ట్ లో పే లేటర్ ఆప్షన్ కూడా ఉన్న విషయం తెలిస్తే.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..