Site icon NTV Telugu

Flipkart Offers 2025: భలే చౌక బేరం.. 10 వేలకే ‘వర్ల్‌పూల్‌’ 3 డోర్ రిఫ్రిజిరేటర్!

Whirlpool 215l Triple Door

Whirlpool 215l Triple Door

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో 2025 దసరా సేల్ జరుగుతోంది. మీరు మీ ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే సరైన సమయం. సేల్ సమయంలో ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర పాత రిఫ్రిజిరేటర్ ఉండి.. దానిని మార్చుకోవాలనుకుంటే కేవలం రూ.10000కి కొత్త ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయొచ్చు. 10 వేలకే బెస్ట్ కంపెనీ అయిన ‘వర్ల్‌పూల్‌’ రిఫ్రిజిరేటర్ ఏంటి?, అందులోనూ టాప్ మోస్ట్ 3 డోర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా?. ఫుల్ డీటెయిల్స్ ఓసారి తెలుసుకుందామా?.

ప్రతి సంవత్సరం లాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్లిప్‌కార్ట్’ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో రిఫ్రిజిరేటర్లపై భారీ డీల్‌లను అందిస్తుంది. ముఖ్యంగా ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో వర్ల్‌పూల్‌ 215 లీటర్ ఫ్రాస్ట్-ఫ్రీ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.32150గా ఉంది. కానీ సేల్ సమయంలో మీరు దీన్ని రూ.22,790కి కొనుగోలు చేయవచ్చు. అంటే మీకు 29 శాతం తగ్గింపు పొందవచ్చు. ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మీరు క్రెడిట్ కార్డుతో వర్ల్‌పూల్‌ 3 డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.4000 తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై మాత్రమే ఉంది. ఈ ఆఫర్ అప్లై అయితే రిఫ్రిజిరేటర్ ధర రూ.18,750కి తగ్గుతుంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. మీరు మీ పాత రిఫ్రిజిరేటర్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే.. మీరు రూ.8,000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అంటే మీరు కేవలం రూ.10,000కి కొత్త ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్ మీ పాత రిఫ్రిజిరేటర్ కండిషన్, ధరపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

Also Read: Redmi A5 Airtel: ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్.. 6 వేలకే 5200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ షావోమీ ఫోన్!

మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐలు 12 నెలల వరకు అందుబాటులో ఉన్నాయి. వర్ల్‌పూల్‌ 3 డోర్ రిఫ్రిజిరేటర్ ఈఎంఐ ధర నెలకు సుమారు రూ.1,900 మాత్రమే. రెగ్యులర్ ఈఎంఐలు 18, 24, 36 నెలలకు కూడా అందుబాటులో ఉన్నాయి. 36 నెలల ఈఎంఐ ఎంచుకుంటే నెలవారీ చెల్లింపు రూ.800, 24 నెలల నెలల ఈఎంఐ ఎంచుకుంటే రూ.1116, 18 నెలల నెలల ఈఎంఐ ఎంచుకుంటే రూ.1430 చెల్లించాల్సి ఉంటుంది. మీరు మీ సౌలభ్యం, బడ్జెట్ ప్రకారం ఈఎంఐని ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్లు కాలానుగుణంగా మారవచ్చని గుర్తుంచుకోండి. కాబట్టి రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని ఆఫర్‌లను తనిఖీ చేయడం ముఖ్యం.

Exit mobile version