Site icon NTV Telugu

Flipkart Sale 2023: మరో సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌.. వాటిపై 75 శాతం డిస్కౌంట్స్! బ్యాంక్ ఆఫర్స్ కూడా

Flipkart Sale 2023

Flipkart Sale 2023

Grand Home Appliances Sale 2023 Starts From Spe 10 in Flipkart: గత కొన్ని నెలలుగా ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Flipkart Grand Home Appliances Sale 2023)ను మరోసారి ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. 7 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లకు ఆఫర్ల జాతర ఉంటుంది. ఇదివరకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్ ఆగష్టు 14 నుంచి 18వ తేదీ వరకు జరిగింది.

‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో భాగంగా టీవీ, హోమ్ అప్లియెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 4K స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్స్, ఫాన్స్, హీటింగ్ మరియు కూలింగ్ అప్లియెన్సెస్, హోమ్ అప్లియెన్సెస్, మైక్రో వేవ్ ఓవెన్స్ లాంటి వాటిపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. హోమ్ అప్లియెన్సెస్ కొనాలనుకునేవారికి ఈ సేల్ బాగా ఉపయోగపడనుంది.

Also Read:

‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో ఫ్లిప్‌కార్ట్‌ అందించే డిస్కౌంట్స్ సహా భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, వన్ కార్డ్, కొటాక్ మహీంద్రా కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. దాదాపుగా 10 శాతం బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో మీరు మొత్తంగా 85 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్‌లో భారీ బడ్జెట్ వస్తువులు కూడా సగం ధర కంటే తక్కువగా అందుబాటులో ఉంటాయి.

Exit mobile version