NTV Telugu Site icon

Delhi Airport: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. విమానాల దారి మళ్లీంపు

Delhi Airport

Delhi Airport

దేశ రాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డంకిగా మారింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్‌ కావడం లేదు.. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని ఎయిర్ పోర్టు అధికారులు తెలియజేశారు.

Read Also: Chandrababu: దుర్గమ్మ సేవలో టీడీపీ అధినేత.. నా శేష జీవితం ప్రజలకే అంకితం..

అయితే, ఢిల్లీలో వర్షం కారణంగా ఇవాళ ఉదయం 7: 30 నుంచి 10: 30 గంటల మధ్య వెళ్లాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. 18 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు పంపించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా పిల్లలు దగ్గుకు గురౌవుతున్నారు.

Read Also: Pocharam Srinivas Reddy: ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎక్జాట్ పోల్స్ వేరు..

ఇక, ఢిల్లీలోని వివిధ నగరాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ విహార్ 388, అశోక్ విహార్ 386, లోధి రోడ్ 349తో పాటు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం 366 వద్ద రికార్డు స్థాయిలో కాలుష్యం నమోదు అయింది. అయితే, ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-3ని తొలగిస్తున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. గ్రాప్-1, గ్రాప్-2లను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.