NTV Telugu Site icon

Minister KTR : యాదిమరిసిండ్రా సారు.. విద్యార్థుల ద్రోహి కేటీఆర్ అంటూ ఫ్లెక్సీలు

Minister Ktr

Minister Ktr

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని కట్టడం కలకలం లేపింది. మండల కేంద్రములోని సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారిపై ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అయితే టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సొంత గ్రామంలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలవడంతో స్థానికంగా కలకలం రేపుతుంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసిన ఘటన ఇంకా మరువకముందే, మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ వెలవడంతో మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Also Read : Rishab Shetty: ‘కాంతార’ హీరో కఠిన నిర్ణయం.. ఆ సినిమాలే చేస్తాడట

డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి మంత్రి కేటీఆర్ యాదిమరిసిండ్రా సారు అని, విద్యార్థుల ద్రోహి కేటీఆర్ – ఈ పాలన మాకొద్దు అంటూ ఫ్లెక్సీ లో వ్రాతలు కనిపించడంతో ఈ పని ఎవరు చేశారంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంట్టున్నారు. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్‌ పే లాంటి పోస్టర్లు మునుగోడులో గోడలకు అంటించిన విషయం తెలిసిందే.