ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకే రోజు అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యక్రమాలు ఉండటంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పవిత్ర సంగమం వద్ద జల హారతి కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవనున్న నేపద్యంలో స్వాగతం పలకడానికి రింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సంధర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాళులర్పించేందుకు రింగ్ సెంటర్ లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇంచుమించు ఒకే సమయానికి ఇరుపార్టీల కార్యక్రమాలు జరగనుండడంతో, పోటా పోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు హాజరవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్సార్ జయంతి వేడుకలకు కొంత సమయం ఆగాల్సిందిగా వైసీపీ కార్యకర్తలకు పోలీసుల సూచించారు. వైసీపీ కార్యకర్తలు వైఎస్సార్ జయంతి వేడుకలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి చేరుకుని జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. పరిస్దితి గందరగోళంగా మారనుండడంతో వైసీపీ ఫ్లెక్సీల తొలగించారు.
Flexi War : ఎన్టీఆర్ జిల్లాలో ఫ్లెక్సీల వార్

Tdp Ycp